close
దారులే వాగులయ్యాయ్‌ 

బిహార్‌, అసోంలో జల విలయం 
వరదల తీవ్రతకు 139 మంది మృత్యువాత

పట్నా, గువహటి: బిహార్‌, అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి 1.10 కోట్లమందికిపైగా ప్రజలు జల విలయం గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. తాజా వరదల తీవ్రతకు మృత్యువాతపడ్డవారి సంఖ్య శుక్రవారం నాటికి 139కి పెరిగింది. బిహార్‌వ్యాప్తంగా 12 జిల్లాల్లో 67.76 లక్షలమంది వరద విపత్తుతో ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్రంలో వరదల బారినపడి దుర్మరణం పాలైనవారి  సంఖ్య 92కు చేరుకుంది. ఒక్క సీతామడి జిల్లాలోనే మృతుల సంఖ్య 27గా నమోదైంది. నవడా సమీపంలోని ధన్‌పూర్‌ ముసాహరి గ్రామంలో శుక్రవారం పిడుగుపాటుకు 8 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు 15 ఏళ్లలోపువారే. మరోవైపు, అసోంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి నదులు ఇప్పటికీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అసోంలో 3,705 గ్రామాలకు చెందిన 48.87 లక్షలమంది వరద ముంపులో చిక్కుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 47కి పెరిగింది. కేరళలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, కోజికోడ్‌, వయనాడ్‌, మలప్పురం, కన్నూర్‌ జిల్లాల్లో శుక్రవారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కొల్లాంలో ఏడుగురు జాలర్లు గల్లంతయ్యారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.