Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179103
            [news_title_telugu_html] => 

పోలవరంపై ఎలా ముందుకెళ్దాం

[news_title_telugu] => పోలవరంపై ఎలా ముందుకెళ్దాం [news_title_english] => [news_short_description] => పోలవరం జలవిద్యుత్తు కేంద్రం, పోలవరం ప్రధాన డ్యాం పనుల టెండర్ల వ్యవహారంపై  ఏపీ సీఎం జగన్‌ శనివారం జలవనరులశాఖ, జెన్‌కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/ucbDTcLvUTY [news_videoinfo] => |https://www.youtube.com/embed/ucbDTcLvUTY [news_sections] => ,27, ) )
పోలవరంపై ఎలా ముందుకెళ్దాం - EENADU
close
పోలవరంపై ఎలా ముందుకెళ్దాం

అధికారులతో ఏపీ సీఎం జగన్‌ చర్చలు

ఈనాడు-అమరావతి: పోలవరం జలవిద్యుత్తు కేంద్రం, పోలవరం ప్రధాన డ్యాం పనుల టెండర్ల వ్యవహారంపై  ఏపీ సీఎం జగన్‌ శనివారం జలవనరులశాఖ, జెన్‌కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులకు సంబంధించి నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ జెన్‌కో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టి, రివర్స్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రధానంగా చర్చ జరిగింది. తొలుత సీఎం జలవనరులశాఖ అధికారులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ, ప్రభుత్వం తరఫున ఇచ్చిన సమాధానం, తిరిగి అథారిటీ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదిక తదితర అంశాలను అధికారులు వివరించారు. జలవిద్యుత్తు కేంద్రం పనులను మినహాయించి ఒక్క ప్రధానడ్యాం పనులకు టెండర్లు కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. తర్వాత ఇంధనశాఖ ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. న్యాయపరంగా ముందుకువెళ్లడమా లేక..ఇతరత్రా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న కోణంలోనూ చర్చించినట్లు తెలిసింది. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. సోమవారం మరోసారి ఈ అంశంపై సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు

రేపు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. అంతర్రాష్ట మండలి స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుడి హోదాలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షాతో జగన్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.