close

తాజా వార్తలు

లవ్లీ యూనివర్శిటీ విద్యార్థినికి జాక్‌పాట్‌ (ప్రకటన)

జలంధర్‌: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ(ఎల్‌పీయూ)కు చెందిన ఓ విద్యార్థిని జాక్‌పాట్‌ కొట్టింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న తాన్య అరోరా రూ. 42 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైంది. తాన్య హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఆర్‌&డీ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహించనుంది. ఉత్తర భారత ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇంజినీరింగ్‌ ఫ్రెషర్‌ విద్యార్థులకు వచ్చిన ఉద్యోగ ఆఫర్లలో అత్యధిక వేతనం ఉన్న ఆఫర్‌ ఇదేనని యూనివర్శిటీ తెలిపింది.

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడంపై తాన్య హర్షం వ్యక్తం చేసింది. ‘మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేశాను. అక్కడ మరచిపోలేని అనుభూతి, అనుభవాన్ని పొందాను. అలాంటి నాకు అక్కడే పనిచేసే అవకాశం లభించడం.. నా కల నెరవేరినట్లయింది. అంతేకాకుండా ప్రతిక్షణం నా కలను నేరవేర్చడంలో ఎల్‌పీయూలోని ఆచార్యులు, మెంటార్స్‌ నాకు ఎంతగానో తోడ్పాటును అందించారు’ అని సంతోషంగా చెబుతోంది. ఈ సందర్భంగా ఎల్‌పీయూ ఛాన్సలర్‌ అశోక్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. ‘తాన్య ఎంపిక కావడం గర్వంగా ఉంది. విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకునేందుకు మేం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. వారికి అనేక అవకాశాలు కల్పిస్తున్నాం. యూనివర్శిటీలోని ఇతర విద్యార్థులు సైతం తాన్యను ఆదర్శంగా తీసుకొని వారి కుటుంబానికి, కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలి’ అని అన్నారు.

గత మూడేళ్లుగా లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీలో రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ జరుగుతున్నాయి. ఎల్‌పీయూకు చెందిన పూర్వ విద్యార్థుల్లో చాలా మంది హెచ్‌పీ, అమెజాన్‌, సిస్కో, యాపిల్‌, గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఎల్‌పీయూలో అడ్మిషన్‌ రావాలంటే యూనివర్శిటీ సొంతంగా నిర్వహించే ఎల్‌పీయూనెస్ట్‌లో పాసవ్వాలి. పూర్తిగా మెరిట్‌ ఆధారంగా ఎల్‌పీయూలో ప్రవేశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఎల్‌పీయూనెస్ట్‌ని నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఒక్కో విద్యార్థి రూ.5.40 లక్షల వరకు ఉపకారవేతనం పొందేందుకు అవకాశం ఉంటుంది.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎల్‌పీయూ విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. కార్పొరేట్‌ రంగంలోని అనేక మంది నిష్ణాతులు వారి అనుభవాలను ఇక్కడి విద్యార్థులతో పంచుకుంటారు. వివిధ పరిశ్రమలకు చెందిన సీనియర్‌ నిపుణులు విద్యార్థుల పాఠ్యాంశాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తారు. అదే సమయంలో వారు రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా నిత్యం మార్పు చెందుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చేలా శ్రద్ధ తీసుకుంటారు. దీని ద్వారా ఎల్‌పీయూ విద్యార్థుల వృత్తి విద్యా నైపుణ్యాలు పెరగడమే కాకుండా పరిశ్రమలకు చెందిన లైవ్‌ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతికత, ఆవిష్కరణలు పరిచయం చేస్తూ విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.