
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద గట్టి పోటీ నెలకొంది. సాధారణంగా పెద్ద పండగకు అగ్ర కథానాయకుల సినిమాల హడావుడి బాగానే ఉంటుంది. అయితే, ఈసారి ఇంకాస్త పోటీ నెలకొంది. ఇందు కారణం మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో వస్తుండగా, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ అంటూ పలకరించబోతున్నారు. అంతేకాదు, ఇరువురూ జనవరి 12వ తేదీనే రావాలని భీష్మించుకుని కూర్చొన్నారట. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు నెలకొంది.
ఇద్దరు అగ్ర హీరోలు ఒకే రోజున వస్తే అది చూడటానికి బాగున్నా, ఆర్థికంగా రెండు సినిమాలకు నష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనింగ్స్‌ను రెండు సినిమాలూ పంచుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక సినిమా ముందుకు.. మరో సినిమా ఒక రోజు వెనక్కి వెళ్తుందని ప్రచారం జరిగింది. దీని వల్ల రెండు సినిమాలకూ మధ్య ఓ రోజు విరామం వస్తుంది. వసూళ్లు రాబట్టుకోవడానికి అది సరిపోతుందని అనుకున్నారు. కానీ, విడుదల తేదీ మార్పు విషయంలో మహేశ్‌బాబు ఒప్పుకోవడటం లేదని టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమ చిత్రాన్ని జనవరి 12వ తేదీనే విడుదల చేయాలని అంటున్నారట.
మరోపక్క అల్లు అర్జున్ కూడా అదే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరి ఇద్దరూ తగ్గకపోతే జనవరి 12 బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదు. ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. ఈ వార్తలపై ఇరు చిత్ర బృందాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- సుప్రీంకు చేరిన దిశ నిందితుల ఎన్కౌంటర్
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
