close

తాజా వార్తలు

మంత్రులు షరీఫ్‌పై దాడి చేశారు: చంద్రబాబు

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీలు నిన్న మండలిలో అసాధారణంగా పోరాడి ధర్మాన్ని కాపాడారని  అభినందించారు. ‘‘ రాష్ట్ర భవిష్యత్తు కాపాడి.. ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు. యనమల అనుభవం, పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం పోశారు. తెదేపా యువ ఎమ్మెల్సీలు ధైర్యం, తెగువ ప్రశంసనీయం. వైకాపా మంత్రులు కౌన్సిల్ ఛైర్మన్‌ షరీఫ్ పై దాడి చేశారు. ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో ఛైర్మన్‌ని అవమానించారు. నమాజు చేయనీకుండా మంత్రులు అడ్డుకున్నారు. ముందు మాట్లాడాలి, ఆ తర్వాతే నమాజు.. గిమాజు అని మంత్రి బొత్స అవహేళన చేశారు. మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని బెదిరించారు.’’ 

లోకేశ్‌పై దౌర్జన్యం..

‘‘ ముగ్గురు మంత్రులు లోకేశ్‌ పై దౌర్జన్యం చేశారు. ఉన్మాదంతో, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. ఎమ్మెల్సీలు భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. అసెంబ్లీలో వైకాపా ఏకపక్షంగా వ్యవహరించింది. 

చర్చకు అవకాశం ఇవ్వకుండా మొండిగా చేసింది. శాంతియుతంగా తెదేపా ఎమ్మెల్యేల ఆందోళ చేస్తుంటే అడ్డుకున్నారు. రింగుదాటి వస్తే బయట పడేయండని సీఎం జగన్ మార్షల్స్‌ను ఆదేశించారు. అదే వైకాపా మంత్రులు కౌన్సిల్లో చేసిందేమిటి? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైకాపా ఎమ్మెల్సీలను ఏం చేయాలి?ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైకాపా చూసింది. తెదేపా ఎమ్మెల్సీలంతా ప్రతిఘటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. వాళ్లకుండే శక్తినంతా వినియోగించారు. ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం. ప్రజల ఆకాంక్షలు నిలబెట్టే ప్రజాస్వామ్య పోరాటం’’

ఇది ప్రజా విజయం...
‘‘సంఖ్య కాదు.. స్ఫూర్తి ముఖ్యం అని రుజువు చేశారు. 
సభలో వైకాపా ఎన్నో దురాగతాలకు పాల్పడింది. కరెంట్ కట్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. 25 మంది మంత్రులు కౌన్సిల్‌లోనే తిష్ట వేసి వీరంగం చేశారు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తుకుతెచ్చారు.
 అప్పుడూ ఇలాగే సభలోపల, బయటా పోరాటం చేశాం. ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఇప్పుడూ అదే స్ఫూర్తిని మళ్లీ తెదేపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చూపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని రాజధాని పరిరక్షణ ఉద్యమం గుర్తుకు తెచ్చింది. వైసీపీ వాళ్లు వేధించినా తెదేపా ఎమ్మెల్సీలు వీరోచితంగా నిలబడ్డారు. 

గల్లా జయదేవ్‌ను శారీరకంగా, మానసికంగా హింసించారు. తెదేపా ఎమ్మెల్సీలు ధ్వజ స్తంభాలుగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. మీ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మీ త్యాగాలు వృథా కావు. మీ స్ఫూర్తి కలకాలం చరిత్రలో ఉంటుంది. చట్టసభ పోరాటంలో ప్రజా ఆకాంక్షలను తెదేపా నిలబెట్టింది.ఇక ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. జేఏసీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అంబేడ్కర్‌  సాక్షిగా నేడు జరిగే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. దీనిని ఒక ప్రజావిజయంగా గ్రామగ్రామానా జరపాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.