close

తాజా వార్తలు

మండలి కార్యదర్శి తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు 

అమరావతి: ఏపీ శాసనమండలి కార్యదర్శిపై ఛైర్మన్‌ షరీఫ్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లుల రద్దు అంశంలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై బులెటెన్‌ విడుదల చేయాలన్న తన ఆదేశాలను మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించడంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. మండలిలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో  భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్‌ కమిటీ నియమించే అంశంలో జరిగిన వ్యవహారాన్నే గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.  రూలింగ్‌ అమలు చేయకుండా కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. విశిష్ఠ అధికారంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాననీ.. ఛైర్మన్‌ నిర్ణయాన్ని కార్యదర్శి వ్యతిరేకించడం ఇప్పటివరకు జరగలేదని షరీఫ్‌ చెప్పారు.

రాజ్‌భవన్‌కు వెళ్లిన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ గవర్నర్‌కు నాలుగు పేజీల వినతి పత్రాన్ని అందజేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుకు సంబంధించి సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటులో చొరవ తీసుకోవాలనీ.. అలాగే మండలి నిర్ణయాలకనుగుణంగా కార్యదర్శి వ్యవహరించేలా చూడాలని గవర్నర్‌ను కోరారు.  మండలి కార్యదర్శి బాలకృష్ణాచార్యులు, ఆయన సిబ్బంది తనకు ఏమాత్రం సహకరించడంలేదని నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగానే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు ఆదేశాలను ఉల్లంఘించారని షరీఫ్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను లేఖలో వివరించిన ఛైర్మన్‌‌.. బులెటెన్‌ విడుదల చేయాలని తాను ఇచ్చిన ఆదేశాలను  తిరస్కరిస్తూ కార్యదర్శి పంపిన నోట్‌ ఫైల్స్‌ను లేఖకు జత చేశారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై ఇప్పటికే చాలా ఆలస్యం చేశారనీ.. ఇకనైనా తన ఆదేశాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.