Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143487
            [news_title_telugu_html] => 

కోహ్లీసేన చేతిలో ఓడితే ప్రపంచం అంతమైపోదు!

[news_title_telugu] => కోహ్లీసేన చేతిలో ఓడితే ప్రపంచం అంతమైపోదు! [news_title_english] => Not winning in India is not going to be end of world for South Africa new interim director [news_short_description] => భారత్‌లో కోహ్లీసేన చేతిలో ఓడిపోతే ప్రపంచమేమీ అంతమైపోదని దక్షిణాఫ్రికా జట్టు తాత్కాలిక డైరెక్టర్‌ ఎనోచ్‌ కేవీ అన్నాడు. ఉపఖండంలో రాణించడమే తమ ముందున్న తొలి లక్ష్యమని వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎనోచ్‌ను... [news_tags_keywords] => Enoch Nkwe,Team India,INDvsSA [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:20:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోహ్లీసేన చేతిలో ఓడితే ప్రపంచం అంతమైపోదు! - Not winning in India is not going to be end of world for South Africa new interim director - EENADU
close

తాజా వార్తలు

కోహ్లీసేన చేతిలో ఓడితే ప్రపంచం అంతమైపోదు!

జోహన్స్‌బర్గ్‌: భారత్‌లో కోహ్లీసేన చేతిలో ఓడిపోతే ప్రపంచమేమీ అంతమైపోదని దక్షిణాఫ్రికా జట్టు తాత్కాలిక డైరెక్టర్‌ ఎనోచ్‌ కేవీ అన్నాడు. ఉపఖండంలో రాణించడమే తమ ముందున్న తొలి లక్ష్యమని వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎనోచ్‌ను కొత్తగా నియమించింది. ఆయన జట్టుకు కోచ్‌, సెలక్టర్‌, టీమ్‌ మేనేజర్‌గా వ్యవరిస్తాడు. సహాయ సిబ్బంది మొత్తం ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తారు. ఫుట్‌బాల్‌ లీగుల్లో మేనేజర్ల పదవి స్ఫూర్తిగా తీసుకొని సఫారీ బోర్డు ఆయన్ను నియమించింది.

‘మా ముందున్నది అతిపెద్ద సవాల్‌. వెంటనే మేం మా ముద్ర వేస్తామన్న నమ్మకం ఉంది. అలా జరగకపోతే ప్రపంచమేమీ అంతమైపోదు. ప్రతిదాంట్లో ఏదో ఒక అవకాశం దాగుంటుంది’ అని ఎనోచ్‌ అన్నారు. సఫారీ జట్టు సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. ఆ నెల 15న ధర్మశాలలో తొలి టెస్టు జరగనుంది. విశాఖపట్నం, పుణె, రాంచీ వేదికల్లో మిగతావి జరుగుతాయి. ఇంగ్లిష్ ప్రీమియర్‌ లీగ్‌లో బార్సిలోనా మేనేజర్‌ గార్డియోలా తరహాలో ఎనోచ్‌ పనిచేస్తారు. ఆటగాళ్ల ఎంపిక, అధికారాల్లో అన్నింటా ఆయనకే అధికారాలున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.