close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చైనాలో మరో వైరస్‌ వెలుగులోకి

మహమ్మారిగా మారేందుకు అవకాశం
ప్రస్తుతానికి ముప్పు లేదన్న శాస్త్రవేత్తలు

బీజింగ్‌: కరోనా తరహాలో జంతువుల నుంచి మనుషులకు సోకి మహమ్మారిగా మారే అవకాశమున్న మరో వైరస్‌ను చైనాలో గుర్తించారు. ఈ మేరకు చైనా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాన్ని అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెన్స్‌ జర్నల్‌’లో ప్రచురించారు. జి-4గా పిలిచే ఈ వైరస్‌ ఇప్పటికే చైనాలోని పందుల పరిశ్రమల్లో పనిచేసే వారికి సోకినట్టు అధ్యయనం పేర్కొంది. 338 మందికి రక్త పరీక్షలు చేయగా 35 మంది(10 శాతం) మందిలో ఈ వైరస్‌ గుర్తించారు. అధ్యయనం చేసిన చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీపీ) శాస్త్రవేత్తల ప్రకారం.. జి-4 వైరస్‌ మానవ కణాల్లోకి సులువుగా ప్రవేశించగలదు. శాస్వకోశ వ్యవస్థతో తన ప్రతిరూపాన్ని సృష్టించగలదు. ఇది సోకిన వారిలో తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తి ఈ వైరస్‌ను ఎదుర్కోలేదు. మానవ శరీర కణాల్లోకి చేరాక మరింత శక్తిమంతంగా మారి మహమ్మారిగా అవతరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదని వారు చెప్పారు. ఇదే అంశంపై అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ రోగ విజ్ఞాన నిపుణులు ఎరిక్‌ డింగ్‌ స్పందిస్తూ.. ఇదేమీ కొత్త వైరస్‌ కాదని, 2016కు ముందే గుర్తించిందన్నారు. ఈ వైరస్‌ ప్రస్తుతం పందుల్లోనే ఉందని ట్విటర్‌లో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఈ వైరస్‌ మనుషులకు సోకిన రుజువులేమీ లేవని, అయినప్పటికీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తుండాలన్నారు. ఇలాంటి ఇన్‌ప్లూయెంజా వైరస్‌లకు వ్యాక్సిన్‌లు కనిపెట్టవచ్చని, అయితే అందుకు పట్టే సమయమే ఇక్కడ కీలకమన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.