close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కరోజులో 2,083

రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదే అత్యధికం
మరో 11 మంది మృతి
ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలకు గిరాకీ
ప్రభుత్వాసుపత్రుల్లో 72 శాతం ఖాళీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్క రోజులో అత్యధికంగా, తొలిసారిగా 2 వేల మార్కు దాటాయి. శుక్రవారం 21,011 నమూనాలు పరీక్షించగా 2,083 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మరో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 64,786కి చేరుకుంది. వారం వ్యవధిలో 12,320 మంది మహమ్మారి బారిన పడగా, ఒక్క జులై నెలలోనే దాదాపు అర లక్షకు చేరువలో కేసులు నమోదవడం తీవ్రతను చెప్పకనే చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపు 75 శాతం జులై నెలలోనివేనని వైద్యారోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బాధితులంతా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తుండటంతో వాటిలో పడకలకు గిరాకీ పెరిగింది. అదే తరుణంలో ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయి.
జిల్లాల్లోనూ పెరుగుతున్న ఉద్ధృతి
జీహెచ్‌ఎంసీ చుట్టూ ఉన్న జిల్లాలతోపాటు నగరాలు, పట్టణాల్లో కేసులు పెరుగుతున్నాయి.   గడిచిన వారం రోజుల్లో కొన్ని పట్టణాల్లో రెండింతలయ్యాయి. కరీంనగర్‌, ఖమ్మం, మేడ్చల్‌, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌లో ఈ తరహా పెరుగుదల కన్పిస్తోంది. కరీంనగర్‌లో గత నాలుగు రోజులుగా సగటున దాదాపు వంద చొప్పున, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో రోజుకి 200కుపైగా నమోదవుతున్నాయి.

ప్రైవేటు వైపు పరుగులు
ప్రజలు వైద్యం కోసం ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తుండటంతో వాటిలో పడకలకు గిరాకీ పెరుగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో శుక్రవారానికి 6,422 పడకలు ఉండగా, 4401 భర్తీ(ఆక్యుపెన్సీ రేటు 63 శాతం) అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శుక్రవారం నాటికి ఆక్యుపెన్సీ రేటు 28 శాతంగా ఉంది. గాంధీ ఆసుపత్రిలో 1,890 పడకలకుగానూ 50 శాతానికిపైగా ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి.
ఒక్కరోజే 11 మంది మృతి
కరోనా చికిత్స పొందుతూ వారం రోజుల్లో 75 మంది చనిపోయారు. శుక్రవారం 11 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 530కి చేరుకుంది. 1,114 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతానికి 17,754 మంది చికిత్స పొందుతున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.