3 రాజధానులకు సహకరించండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రాజధానులకు సహకరించండి

హైకోర్టును కర్నూలులో పెట్టేందుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయండి
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వినతి

ఈనాడు, దిల్లీ: ‘అభివృద్ధి వికేంద్రీకరణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల మధ్య సమతౌల్యంతో కూడిన అభివృద్ధికి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చాం.. ఈ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం.. ఈ విషయంలో మాకు సహకరించండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని అమిత్‌ షా నివాసంలో గురువారం రాత్రి ఆయనను ముఖ్యమంత్రి కలుసుకున్నారు. వారి మధ్య సుమారు 90 నిమిషాలు భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారని ముఖ్యమంత్రి కార్యాలయం నోట్‌ విడుదల చేసింది. దాని ప్రకారం... ‘అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ 2020 ఆగస్టులో చట్టం తీసుకొచ్చాం. హైకోర్టును కర్నూలులో పెడుతూ రీనోటిఫికేషన్‌ జారీ చేయండి. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్లు వచ్చి రాష్ట్రంపై ఆర్థికభారం తగ్గుతుంది’ అని పేర్కొన్నారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం వనరులు వెచ్చిస్తున్నందున నిధుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం పనులకు నిధులివ్వాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు