కొత్తగా 609 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 609 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 609 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,46,606కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరో 4 మరణాలు సంభవించగా, ఇప్పటి వరకూ 3,811 మంది కన్నుమూశారు. తాజాగా 647 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తంగా 6,34,018 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈనెల 3న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,777 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 1,72,595 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ 1,13,35,944 మంది తొలిడోసును, 35,68,149 మంది రెండోడోసును స్వీకరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని