రాష్ట్రంలో కోటిన్నర మందికి టీకాలు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో కోటిన్నర మందికి టీకాలు

హుజూరాబాద్‌లో పాజిటివ్‌ల పెరుగుదల

జమ్మికుంట, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ అదుపులో ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని కొవిడ్‌ చికిత్స కేంద్రాన్ని  గురువారం ఆయన డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌లతో కలిసి గురువారం సందర్శించారు. అనంతరం  మాట్లాడుతూ... రాష్ట్రంలో కోటీ 50 లక్షల మందికి కొవిడ్‌ టీకాలు వేశామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ కార్యక్రమాలతో పాజిటివ్‌ కేసుల్లో కొంత పెరుగుదల ఉందని.. దీనిపై జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు.


కొత్తగా 582 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 582 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు. 5వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదయిన కరోనా సమాచారాన్ని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జి.శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 83 నమోదవగా కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో 61 చొప్పున పాజిటివ్‌లు నమోదయ్యాయి. నారాయణ్‌పేట్‌, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని