సత్వరమే ఉద్యోగుల విభజన

ప్రధానాంశాలు

సత్వరమే ఉద్యోగుల విభజన

నగదు రహిత ఆరోగ్య సేవల పథకం  
టీఎన్జీవో నేతలకు సీఎం కేసీఆర్‌ హామీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే 95 శాతం స్థానిక రిజర్వేషన్ల కోసం కొత్త జోనల్‌ విధానం తెచ్చామని, దాంతో నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కొత్త విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు నగదురహిత ఆరోగ్య పథకం అమలు కోసం అధికారులు, సంఘాల నేతలు సమావేశమై విధివిధానాలను రూపొందించాలన్నారు. టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, సహఅధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి ఆదివారం దిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై విన్నవించారు. రాష్ట్ర ఉద్యోగులకు ఆదాయపు పన్ను వార్షిక రాయితీని రూ. 2.50 లక్షల నుంచి రూ. 10 లక్షలను పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. గచ్చిబౌలిలో భాగ్యనగర్‌ హౌసింగ్‌ సొసైటీ సంబంధించిన స్థలాన్ని త్వరలో ఉద్యోగులకు కేటాయించాలని కోరారు. ఆదాయపు పన్ను రాయితీ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని సీఎం తెరాస ఎంపీలకు సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని