జిల్లాల్లోనూ పెరుగుతున్న ఆన్‌లైన్‌ నేరాలు

ప్రధానాంశాలు

జిల్లాల్లోనూ పెరుగుతున్న ఆన్‌లైన్‌ నేరాలు

అశ్లీల దృశ్యాల ప్రసారం కేసులు జగిత్యాలలో అధికం
వ్యక్తిత్వాన్ని కించపరిచిన కేసుల్లో మెదక్‌ది రెండో స్థానం
డేటా చౌర్యం కేసులన్నీ రాచకొండలోనే నమోదు

న్‌లైన్‌ సంబంధ నేరాలు హద్దుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ద్వితీయ శ్రేణి నగరాలకు, పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. 2020 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కొన్ని అంశాల్లో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల కంటే జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటం గమనార్హం. సాధారణంగా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలోనే ఏటా 90 శాతానికి పైగా కేసులుంటాయి. ఆన్‌లైన్‌ వినియోగం జిల్లాల్లోనూ పెరిగిపోవడంతో అక్కడా సైబర్‌ నేరాలు అధికంగా నమోదవుతున్నాయి.

* అభ్యంతరకర అంశాలు, అశ్లీల దృశ్యాల ప్రసారానికి సంబంధించిన కేసులు ఎక్కువగా జగిత్యాల జిల్లాలో వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా కేసులు 97 నమోదు కాగా.. జగిత్యాలలో అత్యధికంగా 28 కేసులు రావడం గమనార్హం. తర్వాతి స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో వీటి సంఖ్య 27. మహబూబ్‌నగర్‌లో 13.

* సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేసినందుకు రాష్ట్రంలో 111 కేసులు నమోదయ్యాయి. ఇవి హైదరాబాద్‌లో 87... రెండో స్థానంలో ఉన్న మెదక్‌లో 11.

* ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన మొత్తం 306 కేసుల్లో హైదరాబాద్‌లో 160 ఉండగా.. జగిత్యాలలో 43, సిద్దిపేటలో 24 ఉన్నాయి.

* డేటాచౌర్యం కింద నమోదైన మొత్తం 29 కేసులూ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనివే కావడం గమనార్హం.

* ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ నేరాల కేసుల్లో దాదాపు 97 శాతం ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌లోనే నమోదయ్యాయి. మొత్తం 1405 కేసులకు గాను హైదరాబాద్‌లో 1366, రాచకొండలో 20, సైబరాబాద్‌లో 1 ఉన్నాయి.

* సైబరాబాద్‌ కంటే ఎక్కువగా కరీంనగర్‌లో 9 కేసులుండటం గమనార్హం.

- ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని