close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెమ్‌డెసివిర్‌ దిగుమతులపై సుంకాల రద్దు

ఈనాడు, దిల్లీ: కరోనా బాధితుల చికిత్సలో కీలకపాత్ర పోషిస్తున్న రెమ్‌డెసివిర్‌, దాని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల దేశీయంగా ఈ ఔషధ లభ్యత పెరగడంతోపాటు, దాని ఖరీదు కూడా తగ్గుతుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రెవెన్యూశాఖ పేర్కొంది. దిగుమతి సుంకం నుంచి మినహాయింపు పొందిన వాటిలో రెమ్‌డెసివిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియెంట్స్‌ (ఏపీఐ), ఇంజెక్షన్‌ రెమ్‌డెసివిర్‌, ఈ ఔషధం తయారీలో ఉపయోగించే బీటా సైక్లోడెక్స్‌ట్రిన్‌ ఉన్నాయి. తాజా వెసులుబాటు.. ఈ ఏడాది అక్టోబరు 31 వరకూ అమల్లో ఉంటుంది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు