close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లైఫ్‌ సైన్సెస్‌కు ఇది రాజధాని

 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్న పరిశ్రమ
 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
 నానక్‌రాంగూడలో మెడ్‌ట్రానిక్‌  ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ కేంద్రం ప్రారంభం

రాయదుర్గం, న్యూస్‌టుడే: వ్యాక్సిన్‌, ఔషధాల రాజధానిగా నిలుస్తున్న హైదరాబాద్‌ నగరం లైఫ్‌ సైన్సెస్‌లో, వైద్య పరికరాల తయారీలో కూడా అదే స్థాయికి చేరుకుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘‘సానుకూల ప్రభుత్వ విధానాల నేపథ్యంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నగరంలో 1,000 మంది ప్రపంచ స్థాయి ఆవిష్కర్తలు సేవలందిస్తున్నారు.  2030 నాటికి ఈ రంగం 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. ఇందులో వైద్య పరికరాల తయారీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వైద్య పరికరాల తయారీలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు. నానక్‌రాంగూడ బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్కులో మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఆయన బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలి
మెడ్‌ట్రానిక్‌.. తన వైద్య పరికరాల తయారీ సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలి. మేకిన్‌ ఇండియాలో భాగంగా వైద్య పరికరాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి ఇలాంటి సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసేలా సహకరించాలి’’ అని మంత్రి కేటీఆర్‌ కోరారు. అభివృద్ధి, ఆవిష్కరణ, పరిశోధన రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వైద్య సాంకేతికత అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఫలితంగా నగరం ఇందుకు కేంద్రంగా మారుతోందన్నారు.
కేంద్ర ఫార్మాస్యూటికల్‌ శాఖ కార్యదర్శి ఎస్‌.అపర్ణ వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. వైద్య పరికరాల విపణిని అభివృద్ధిపరుస్తున్నామని, ఇందుకు పటిష్ఠ నియంత్రణ విధానాన్ని రూపొందించి సులభతరంగా ధ్రువీకరణలు పొందేలా చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సంస్థ ప్రముఖులు పాల్గొన్నారు. వర్చువల్‌ విధానంలో నగరంలోని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌ మాన్‌, మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఛైర్మన్‌, సీఈవో జియోఫ్‌ మార్థా తదితరులు మాట్లాడారు.
రాష్ట్రానికి.. దేశానికి గర్వకారణం
‘‘2017లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య పరికరాల పార్కులో 40 తయారీ సంస్థలు వచ్చాయి. మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికాలో ఏర్పాటైన మెడ్‌ట్రానిక్‌ వివిధ దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 500 మందికి ఉపాధి కల్పించారు. ఐదేళ్లలో మరో వేయి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఆ సంస్థ అభివృద్ధి విభాగంలో ఈ కేంద్రం గ్లోబల్‌ హబ్‌గా పనిచేస్తుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు