24 గంటల్లో 375 మంది తాలిబన్లు హతం!

తాజా వార్తలు

Published : 03/08/2021 22:38 IST

24 గంటల్లో 375 మంది తాలిబన్లు హతం!

కాబూల్‌: తాలిబన్లపై అఫ్ఘాన్‌ భద్రతా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 375 మంది తాలిబన్లు హతమైనట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరో 193 మంది గాయపడినట్లు పేర్కొంది. నురిస్తాన్‌, లోగర్‌, కాందహార్‌, హెరత్‌, ఒరుజ్‌గాన్‌, బాల్ఖ్‌, బాగ్‌లాన్‌ తదితర ప్రావిన్సుల్లో జరిపిన దాడుల్లో తాలిబన్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. భారీ విస్తీర్ణంలో ఉగ్రవాద ఆక్రమిత ప్రాంతాలనూ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. హెల్మంద్‌ ప్రావిన్స్‌ రాజధాని లష్కర్‌ గాలో జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది మృతి చెందగా.. 12 మంది గాయపడినట్లు తెలిపింది. మరోవైపు తాలిబన్‌ అధికార ప్రతినిధి జైబుల్లా ముజాహిద్‌ ఈ వార్తలను ఖండించారు. వాయుసేన దాడులు సైతం సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేపట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా దళాలు అఫ్ఘాన్‌ను వదిలివెళ్తున్న నేపథ్యంలో తాలిబన్లు ఆయా ప్రాంతాలను ఆక్రమించడం, వారిని కట్టడి చేసే క్రమంలో దేశ సైన్యం వరుస దాడులతో వారిపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
సాధారణ పౌరుల మృతిపై ఐరాస దిగ్భ్రాంతి
లష్కర్‌ గాలో అఫ్ఘాన్‌ భద్రతా దళాలు, తాలిబన్ల మధ్య పోరులో దాదాపు 40 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఐరాస మంగళవారం వెల్లడించింది. 100 మందికిపైగా గాయపడినట్లు ట్విటర్‌లో పేర్కొంది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. పట్టణ ప్రాంతాల్లో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని