నీతీశ్‌ ఎన్డీయేలోనే సీఎంగా ఉంటారనుకుంటున్నా!

తాజా వార్తలు

Published : 16/11/2020 19:18 IST

నీతీశ్‌ ఎన్డీయేలోనే సీఎంగా ఉంటారనుకుంటున్నా!

పట్నా: బిహార్‌కు జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ ఎన్డీయే తరపునే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అనుకుంటున్నట్లు ఎల్జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణస్వీకారం చేసిన నీతీశ్‌కు ఆయన వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా చిరాగ్‌ స్పందించారు. ‘మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా నీతీశ్‌కు శుభాకాంక్షలు. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని అనుకుంటున్నా. అదేవిధంగా మీరు ఎన్డీయే తరపునే సీఎంగా కొనసాగుతారని భావిస్తున్నా. మిమ్మల్ని సీఎంగా చేసిన భాజపాకు, సీఎం అయినందుకు మీకు మరోసారి అభినందనలు తెలిజేస్తున్నా’ అని చిరాగ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  అంతేకాకుండా ఎల్జేపీ తనకు పంపిన మేనిఫెస్టోలోని హామీల్ని నెరవేర్చే దిశగా నీతీశ్‌ పనిచేయాలని సూచించారు. కాగా తాజాగా జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. కానీ జేడీయూ ఓట్లను చీల్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని