భారత్‌: 10వేలకు చేరువలో కరోనా మరణాలు!
close

తాజా వార్తలు

Updated : 16/06/2020 15:00 IST

భారత్‌: 10వేలకు చేరువలో కరోనా మరణాలు!

మహారాష్ట్రలోనే 4128 మంది మృత్యువాత

కరోనా మరణాల్లో ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి భారత్‌

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గతకొన్ని రోజులుగా దేశంలో నిత్యం 300లకు పైగా కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 380మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 9900కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక, కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,43,091కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,80,013మంది కోలుకోగా మరో 1,53,178మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ పైపైకి వెళుతోంది. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని