కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్‌‌ ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 29/12/2020 11:38 IST

కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్‌‌ ఆత్మహత్య

బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్​ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం ధర్మె గౌడ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గన్​మెన్, పోలీసులు ఆయన కోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. మంగళవారం వేకువజామున 2గంటల సమయంలో ధర్మె గౌడ మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పక్కన గుర్తించారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధర్మెగౌడ మరణం పట్ల మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్‌ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మెగౌడ మరణం కర్ణాటకకు తీరని లోటని పేర్కొన్నారు.

డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్(మండలి) సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ కే ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగారు. మాటల దాడులతో పాటు ఒకరినొకరు తోసుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మె గౌడను కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లారు. ధర్మెగౌడ మరణం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇదీ చదవండి..
కర్ణాటక విధాన పరిషత్‌లో బాహాబాహీAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని