close

తాజా వార్తలు

Updated : 03/12/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

95లక్షల మార్కును దాటిన కరోనా కేసులు

గత 24 గంటల్లో 35,551 కొత్త కేసులు..526 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నవంబర్ 21 నుంచి రోజూవారీ కేసులు 50 వేలకు దిగువనే నమోదవుతున్నప్పటికీ.. కేసుల నమోదులో హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం 35,551 పాజిటివ్ కేసులు బయటపడగా..మొత్తం కేసులు సంఖ్య 95 లక్షల మార్కును దాటింది. దాంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95,34,964 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. రోజురోజుకూ క్రియాశీల రేటు(4.44శాతం)తగ్గడం, రికవరీ రేటు( 94.11శాతం) పెరుగుతుండటం కాస్త ఊరట కలిగించే పరిణామం. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,22,943గా ఉంది. అలాగే, 89,73,373 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. మరోవైపు, గడిచిన 24గంటల్లో 526 మంది మరణించగా..ఇప్పటి వరకు 1,38,648 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం..నిన్న 11,11,698 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా..మొత్తంగా 14,35,57,647 నమూనా పరీక్షలు నిర్వహించినట్లైంది.   

కరోనా పాజిటివిటీ రేటు తగ్గిన రాష్ట్రాలివే..
నవంబర్ రెండు నుంచి డిసెంబర్ రెండు వరకు..నెల రోజుల వ్యవధిలో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను మంత్రిత్వ శాఖ గ్రాఫ్‌ రూపంలో వివరిస్తూ, ట్వీట్ చేసింది. ఆ జాబితాలో కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్‌, చత్తీస్‌గఢ్‌, తమిళనాడు, గోవా, త్రిపుర ఉన్నాయి.
Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన