పింఛను ఇచ్చేందుకు అడవిలో 25 కి.మీ. నడక

తాజా వార్తలు

Published : 12/08/2021 15:15 IST

పింఛను ఇచ్చేందుకు అడవిలో 25 కి.మీ. నడక

పని పట్ల నిబద్ధత, అంకిత భావంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఓ పోస్టు మాస్టర్‌. ఓ బామ్మకు వృద్ధాప్య పింఛను అందించేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. కొండలు ఎక్కి, అడవుల్లో ప్రయాణించి.. నదిని దాటుకుని ఆమె వద్దకు వెళుతున్నారు. ఆరు నెలల నుంచి వృద్ధురాలికి పింఛను డబ్బులు అందజేసి, ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన క్రీస్తురాజా. జిల్లాలోని కారైయ్యార్‌ డ్యామ్‌కు ఎగువన.. కాలంకడ్‌ ముందంతురై టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో ఇంజిక్కుళి పరిధిలోని గిరిజన తండాలో కుట్టియమ్మల్‌ అనే 105 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. కుట్టియమ్మల్‌కు వచ్చే రూ.1,000 పింఛను అందజేసేందుకు.. క్రీస్తురాజా దాదాపు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. అయితే.. ఈ సారి క్రీస్తురాజాతో పాటు ఈటీవీ భారత్‌ కూడా ఆయన వెంట బయల్దేరింది. ఈ ప్రయాణంలో ఆ పోస్టు మాస్టర్‌ రానుపోను దాదాపు 8 కిలోమీటర్లు నదిలో బోటుపై ప్రయాణిస్తారు. బోటుకు కావాల్సిన డీజిల్‌ కోసం సొంతంగా రూ.500 వరకు ఖర్చు చేస్తున్నారు. ఎప్పుడైనా నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పుడు బోటులో కాకుండా మరో మార్గంలో ప్రయాణించి, వృద్ధురాలి వద్దకు చేరుకుంటారు. అలా వెళ్లినప్పుడు ఇంత కంటే రెట్టింపు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఆరు నెలల క్రితం తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌ వి విష్ణు.. ఇంజిక్కుళి ప్రాంతానికి వచ్చినప్పుడు.. తనకు పింఛను ఇప్పించాలని కుట్టియమ్మల్‌ వేడుకుంది. స్పందించిన కలెక్టర్‌.. ఆమెకు వెంటనే పింఛను మంజూరు చేశారు. అయితే.. ఆ పింఛను డబ్బులు తీసుకునేందుకు దగ్గర్లో ఏటీఎం వంటి సదుపాయాలు లేవు. దీంతో పాపనాశమ్‌ తపాలా కార్యాలయంలో పని చేసే క్రీస్తురాజా.. పోస్టల్‌ మనీయార్డర్‌లో వచ్చే డబ్బులను అందజేసేందుకు ఆమె వద్దకు వెళ్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని