రాజీవ్‌ గాంధీ జయంతి: రాహుల్‌, మోదీ నివాళి

తాజా వార్తలు

Published : 20/08/2020 11:42 IST

రాజీవ్‌ గాంధీ జయంతి: రాహుల్‌, మోదీ నివాళి

దిల్లీ: భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ ఉన్నత వ్యక్తిత్వం, ముందుచూపు గల దార్శినికుడని అని ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘‘రాజీవ్‌ గాంధీ భవిష్యత్తును ఆలోచించే అద్భుతమైన దూరదృష్టి కలిగిన వ్యక్తి. అన్నిటినీ మించి ఆయనది కారుణ్యం, ప్రేమించే తత్వం గల ఉత్తమ వ్యక్తిత్వం. ఆయన నాకు తండ్రి కావటం అదృష్టం.. నేను అందుకు గర్వపడుతున్నాను. ఆయనను నేడు, రేపు, ప్రతిరోజూ మిస్‌ అవుతూనే ఉంటాము’’ అని రాజీవ్‌ 76వ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు. ‘‘మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా వందనాలు అర్పిస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ తదితరులు కూడా రాజీవ్‌ గాంధీని సంస్మరించుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని