close

తాజా వార్తలు

Updated : 25/11/2020 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రంప్‌ క్షమించేశారు..!

ఇంటర్నట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి నుంచి తేరుకొని మిగిలిన కాలానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నారు. శ్వేత సౌధంలో సంప్రదాయం ప్రకారం ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’కు ముందు జరిగే ‘ది నేషనల్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ టర్కీ’ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్వేత సౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో ‘కార్న్‌’ అనే టర్కీ కోడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టారు. దీంతోపాటు ‘కోబ్‌’ అనే టర్కీ కోడిని కూడా జీవించేందుకు వదిలేశారు. ఈ రెండు పక్షులు ఐయోవా స్టేట్‌ యూనివర్శిటీ సంరక్షణలో తమ శేషజీవితాన్ని గడుపుతాయి. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘‘కార్న్‌ నీకు పూర్తి క్షమాభిక్షను ప్రసాదిస్తున్నాను’’ అని ప్రకటించారు. దీంతోపాటు కోబ్‌ను కూడా జీవించేలా వదిలేశారు. 

కోళ్లకు క్షమాభిక్ష ఏమిటీ..?

ప్రతి ఏటా థ్యాంక్స్‌ గివింగ్‌ డేకు మందు అధ్యక్షుడికి ది నేషనల్‌ టర్కీ ఫెడరేషన్ రెండు భారీ టర్కీ కోళ్లను బహూకరిస్తుంది. వీటిని శ్వేతసౌధం విందులోకి వినియోగించరు. జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు అధ్యక్షులు చాలా వరకు బహుమతిగా వచ్చే టర్కీకోళ్లను విందులో వినియోగించే వారు. జాన్‌ ఎఫ్‌  కెనడీ, రిచర్డ్‌ నిక్సన్‌ , జిమ్మీ కార్టర్‌ వంటి వారు మాత్రం వీటిని తినకుండా వదిలేయడమో.. లేదా అసలు స్వీకరించకపోవడమో చేశారు. రోనాల్డ్‌  రీగన్‌ స్వీకరించినా.. వాటిని జీవించేందుకు వదిలేశారు. 1989లో అధికారికంగా జార్జి హెచ్‌ డబ్ల్యూ బుష్‌ అధక్ష్య క్షమాభిక్ష అనే పదాన్ని వాడి ఆ టర్కీ కోడిని జీవించేందుకు వదిలేశారు. అప్పటి నుంచి ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. 2005-2009 వరకు వచ్చిన టర్కీ కోళ్లను డిస్నీల్యాండ్‌ రిసార్ట్‌కు లేదా.. వాల్ట్‌ డిస్ని వరల్డ్‌ రిసార్ట్‌కు తరలించారు. అక్కడ అవి థ్యాంక్స్‌ గివింగ్‌ పరేడ్‌లో పాల్గొన్నాయి.  ఆ తర్వాత కాలంలో మౌంట్‌ వెర్నాన్‌లోని జార్జ్‌ వాషింగ్టన్‌ ఇంటికి.. లీస్‌బర్గ్‌లోని మోర్వెన్‌ పార్క్‌కు తరలించారు. ఇక 2016-19వరకు వచ్చిన టర్కీ కోళ్లను నేషనల్‌ టర్కీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలోని ‘వర్జీనీయ టెక్‌’కు తరలించారు. ఈ సారి మాత్రం కార్న్‌, కోబ్‌లను‌ ఐయోవా విశ్వవిద్యాలయానికి ఇచ్చారు.

అధ్యక్షుడికి ఇచ్చే టర్కీ కోళ్ల ఎంపిక కూడా అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు 80 పక్షులను ఎంపిక చేసి.. వివిధ దశల్లో జల్లెడ పట్టి వాటిల్లో నుంచి రెండిటిని మాత్రమే అధ్యక్షుడి వద్దకు పంపిస్తారు. ఈ రెండిటిని ఆయా టర్కీ కోళ్లు పుట్టిన రాష్ట్రాల విద్యార్థుల సూచనల మేరకు శ్వేత సౌధ సిబ్బంది ఎంపిక చేస్తారు. 

అబ్రహం లింకన్‌ కుమారుడు మారాం చేయడంతో..

1863లో అబ్రహం లింకన్‌ కుటుంబ విందు కోసం టర్కీ కోడిని కొందరు బహూకరించారు. అంతకు ముందు ఏడాదే లింకన్‌ సంతానంలో టెడ్‌, విలియంకు టైఫాయిడ్‌ సోకింది. వారిలో విలియం చనిపోగా.. టెడ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. టెడ్‌కు ఆ టర్కీ కోడి నచ్చింది. దానిని చంపవద్దని తండ్రి లింకన్‌ను ప్రాధేయపడి ఒప్పించాడు. ఆ కోడికి జాక్‌ పేరుపెట్టి పెంచుకొన్నాడు. అమెరికా అధ్యక్షుడికి  బహుమతిగా వచ్చిన జీవిని పెంచుకొన్న తొలిఘటన ఇదే అని చెబుతారు.Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన