కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు

తాజా వార్తలు

Published : 10/04/2021 01:17 IST

కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు

\


భోపాల్: పీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు అంబులెన్సు సిబ్బంది రోడ్డు పక్కన చెరుకు రసం కోసం ఆగారు. ఒకరు కిందికి దిగి, మాస్క్ తీసి, చెరుకు రసం కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇంకొకరు డోరు తీసి దర్జాగా సీట్లో కూర్చున్నారు. లోపల ఉన్నది కరోనా సోకిన వ్యక్తి అనే పట్టింపు వారికేమాత్రం లేదు. వాళ్ల అవతారం చూసి అనుమానంతో స్థానికులు నిలదీస్తే, ‘కరోనా వచ్చింది నాకు కాదు’ అంటూ పెడసరిగా సమాధానం చెప్పాడు ఒకడు. ఇప్పటికే  కరోనా విజృంభణతో ఇబ్బంది పడుతున్న మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఆ ఇద్దరు సిబ్బంది ఆగిన ప్రదేశంలో జనం రద్దీ ఉంది. మరోవైపు వారిలో ఒకరు సరిగా మాస్కు పెట్టుకోలేదు. వారిని పీపీఈ కిట్లలో చూసిన ఓ స్థానికుడు తన ఫోన్‌లో వీడియో తీసి పరిస్థితిని కళ్లకుగట్టారు. అలాగే ‘మీరు కరోనా బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తూ.. మాస్కు కూడా సరిగా ధరించలేదు’ అని ప్రశ్నించారు. ‘నాకు కరోనా లేదు. నేను కరోనా రోగిని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నాను. నన్ను కొంచెం తాగనివ్వండి’ అంటూ జ్యూస్‌ కోసం ఆగిన వ్యక్తి జవాబిచ్చాడు. ఆ సమయంలోనే తన మాస్కును సరిచేసుకున్నాడు.  కాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. 

దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు లక్ష మార్కు దాటిన వేళ, తాజా విజృంభణలో 84 శాతం వాటా ఉన్న 10 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో 3,22,338 మందికి కరోనా సోకగా, 4,113 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కట్టడికి ఇప్పటికే అక్కడ వారాంతపు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని