చైనా మార్కు హితబోధ..!
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా మార్కు హితబోధ..!

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు హఠాత్తుగా భారత్‌, ఐరోపా సంఘం మీద ప్రేమపుట్టుకొచ్చింది. అందుకే వారు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పింది. అవేంటంటే.. చైనాతో వ్యాపారం చేయడం, అమెరికాను దూరం పెట్టడం. అసలు చైనా లాంటి దేశాన్ని దూరం చేసుకోవడం అంటే వారి అభివృద్ధిని వారే దెబ్బతీసుకోవడం వంటిదని తేల్చిచెప్పింది. భారత్‌కు చైనాను దాటేసేంత సత్తా లేదని విశ్లేషించింది.  ఈ మేరకు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఓ వ్యాసం ప్రచురించింది.

‘‘ఐరోపా సంఘంతో సహా పలు చోట్ల చైనా వ్యతిరేక శక్తులు మానవ హక్కుల ముసుగులో అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని .. వారి పార్లమెంట్‌ సభ్యుడైన మిక్‌ వాల్కోనే స్వయంగా బయటపెట్టారు. చైనా అభివృద్ధి ఏ ఒక్క దేశానికి, ప్రాంతానికి ముప్పుకాదు. చైనాకు అడ్డుకట్టవేసే కుట్రపూరితమైన పథకాలు భవిష్యత్తులో బెడిసికొడతాయి.’’

‘‘అమెరికా పివెట్‌ టూ ఏషియా పాలసీలో భాగంగా ఇండో పసిఫిక్‌ వ్యూహం అనుసరిస్తున్న దేశాలు వేర్వేరు భాష్యాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గత వందేళ్లలో జరిగిన మార్పులు కనపడుతున్నాయి. ఆర్థిక మూల కేంద్రాలు  ఆసియా-పసిఫిక్‌ వైపు మళ్లుతున్నాయి.  ఈనేపథ్యంలో చైనాను అణచి వేసేందుకు అమెరికా ‘షేర్డ్‌ వ్యాల్యూస్‌’ పేరిట ఈ ప్రాంతంలోని దేశాలతో జట్టుకడుతోంది. ఈ క్రమంలో ఆ దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌ ఆయుధంగా మారింది. ఈ క్రమంలో భారత్‌కు కొంత లబ్ధి చేకూరి ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఉపయోగపడవచ్చు. కానీ, అది చైనాను కట్టడి చేసే స్థాయికి రాదు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో సప్లై ఛైన్‌ వ్యవస్థ అంతర్జాతీయ నిబంధనలతో పనిచేస్తుంది. దానిని పశ్చిమ దేశాలు ప్రభావితం చేయలేవు. చైనాలో కొవిడ్‌ వ్యాపించినప్పుడు భారత్‌లోని రాజకీయ వేత్తలు కొన్ని కలలుగన్నారు. చైనా స్థానాన్ని అమెరికా సాయంతో ఆక్రమించవచ్చనుకున్నారు. కానీ, తర్వాత అవి కలలుగానే మిగిలిపోయాయి.  చైనా.. భారత్‌కు అత్యిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండటమే అక్కడి రాజకీయ నాయకులకు ఓ మేలుకొలుపు. చైనా-భారత్‌ దేశాల బంధం ఇద్దరికీ లబ్ధి చేకూరుస్తుంది. అదే భారత్‌ అమెరికా పక్షాన చేరితే ఓ  పావుగానే మిగిలిపోతుంది. ఇదే లాజిక్‌ ఐరోపా సంఘానికి కూడా వర్తిస్తుంది’’ అంటూ ఈ కథనం సాగింది. ఓ పక్క భారత సరిహద్దుల్లో ఆయుధాల మోహరింపును ఆపకుండానే చైనా ఇటువంటి కథనాలు ప్రచారం చేయడం విచిత్రం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని