
తాజా వార్తలు
భారత్: యాక్టివ్ కేసులు.. 2లక్షలకు దిగువన
దిల్లీ: దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రికవరీలు వేగంగా పెరడగంతో 2లక్షల దిగువకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,201 యాక్టివ్ కేసులు ఉండగా.. క్రియాశీల రేటు 1.86శాతానికి పడిపోయింది. దేశంలో మొత్తం రికవరీలు.. యాక్టివ్ కేసుల మధ్య తేడా కోటికి పైనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 13,823 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే(10,064) ఈ సంఖ్య కాస్త ఎక్కువ కావడం గమనార్హం.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,95,660కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో మరో 16,988 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,45,741కి చేరింది. రికవరీ రేటు 96.70శాతానికి చేరింది. మరోవైపు కరోనాతో నిన్న మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,52,718కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.44శాతంగా ఉంది. మంగళవారం 7,64,120 కరోనా పరీక్షలు నిర్వహించగా.. జనవరి 19వరకు మొత్తంగా దేశంలో 18,85,66,947 నమూనాలను పరీక్షించారు.
ఇవీ చదవండి..