Sirisha: కల నిజమైన వేళ.. నమ్మలేకపోయా..

తాజా వార్తలు

Published : 12/07/2021 18:19 IST

Sirisha: కల నిజమైన వేళ.. నమ్మలేకపోయా..

అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం గొప్ప అనుభూతి

వాషింగ్టన్‌: ‘కల నిజమైన వేళ.. ఇదంతా నిజమేనా అని నమ్మలేకపోయా. అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అమోఘం’ అంటూ భారత సంతతి మహిళ శిరీష బండ్ల ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్‌’ ద్వారా తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నారామె. ఆరుగురు వ్యోమగాములతో ఈ సంస్థకు చెందిన వీఎస్‌ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక ఆదివారం దిగ్విజయంగా రోదసిలోకి వెళ్లొచ్చింది. అందులో ఈ 34 ఏళ్ల తెలుగు తేజం, ఏరోనాటికల్ ఇంజినీర్‌ కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు చెందిన మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.  

‘యాత్ర ముగించుకుని తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అయినా నేనింకా అక్కడే ఉండిపోయాను. ఈ ప్రయాణం నాకింకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. బహుశా దాన్ని వర్ణించడానికి ఇంకా పెద్ద పదం కావాలేమో! అంతరిక్షం నుంచి భూమిని చూడటం అద్భుత ఘట్టం. ఈ ప్రయాణం మరిచిపోలేను.

అంతరిక్షంలో విహరించాలనే నా కల ఇప్పుడు అక్షరాల నిజమైంది. నేనొక వ్యోమగామిని కావాలనుకున్నాను. సంప్రదాయ పద్ధతిలో కాకుండా అసాధారణమైన రీతిలో నా కల నెరవేరింది. ఇలా ఇంకా ఎంతో మంది ఈ అనుభవాన్ని సొంతం చేసుకుంటారని భావిస్తున్నా. అందుకోసమే మేమున్నాం. భవిష్యత్తులో ఈ యాత్రలకయ్యే ఖర్చును తగ్గించే దిశగా మేం ప్రయత్నాలు చేస్తున్నాం’ అంటూ సరికొత్త పర్యాటకంపై ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని