Anna Hazare: ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే

తాజా వార్తలు

Updated : 25/11/2021 19:49 IST

Anna Hazare: ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే

పుణె: ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే ఆస్పత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుత అన్నా హజారే ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పరిశీలనలో ఉంచినట్టు వివరించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలిపారు. గుండెలోని కరోనరీ ఆర్టెరీలో ఏర్పడిన చిన్న బ్లాకేజీని తొలగించిన తర్వాత హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. 84 ఏళ్ల వయసున్న అన్నా హజారేకు గత రెండు మూడు రోజులుగా ఛాతిలో నొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని రుబే హాల్‌ క్లినిక్‌ ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌) చేయించగా చిన్న బ్లాకేజీ ఉన్నట్టు తేలిందన్నారు. దీంతో వైద్య బృందం ఆ బ్లాకేజీని తొలగించినట్టు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి చీఫ్‌ కార్డియాలజిస్ట్‌, డాక్టర్‌ గ్రాంట్‌ తెలిపారు.

Read latest National - International News and Telugu News


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని