భారత్‌ బయోటెక్‌కు CISF భద్రత!

తాజా వార్తలు

Published : 08/06/2021 21:35 IST

భారత్‌ బయోటెక్‌కు CISF భద్రత!

కేంద్ర హోంశాఖ నిర్ణయం

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో కీలకంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ సంస్థకు కేంద్ర ప్రభుత్వం మరింత భద్రతను పెంచింది. హైదరాబాద్‌లో ఉన్న ప్రాంగణానికి సీఐఎస్‌ఎఫ్‌ కమాండోల భద్రతను కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో హైదరాబాద్‌ శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయంతో పాటు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రానికి 64 మందితో కూడిన సాయుధ బలగాలు పహారా కాయనున్నాయి.

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సమయంలోనూ దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు ఇక్కడ నుంచి వ్యాక్సిన్‌ ఎగుమతి జరుగుతోంది. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తోన్న సంస్థలకు ఉగ్రవాద ముప్పు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతను సమీక్షించింది. దేశ వైద్య, ఆరోగ్య భద్రతకు కీలకంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ప్రాంగణానికి అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం 64 మందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌ సాయుధ బలగాలతో రక్షణ కల్పించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. జూన్‌ 14 నుంచి భారత్‌ బయోటెక్‌ కేంద్రం వద్ద బలగాలు విధులు నిర్వర్తిస్తాయని సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ అనిల్‌ పాండే వెల్లడించారు.

2008లో ముంబయి దాడుల అనంతరం దేశవ్యాప్తంగా ముప్పు ఉన్న పలు ప్రైవేటు ప్రదేశాలకు సాయుధ బలగాలతో భద్రతను అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పది ప్రైవేటు సంస్థలకు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ కల్పిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని