Covid: ఆ 75వేల మంది ఎలా చనిపోయారో..?
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 11:28 IST

Covid: ఆ 75వేల మంది ఎలా చనిపోయారో..?

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ప్రభావంతో బిహార్‌లో మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో దాదాపు 75 వేల మంది గుర్తుతెలియని కారణాలతో కన్నుమూశారు. ఆ రాష్ట్ర అధికారిక కొవిడ్‌ మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఆ రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం లెక్కల ప్రకారం 2019 జనవరి-మే మధ్యలో 1.3లక్షల మంది కన్నుమూశారు. అదే 2021 జనవరి-మే మధ్యలో 2.2లక్షల మంది మరణించారు. ఆ లెక్క ప్రకారం 82,500 అదనపు మరణాలు చోటు చేసుకొన్నాయి.
 
ఈ ఏడాది బిహార్‌లో జనవరి-మే మధ్య కొవిడ్‌ కారణంగా 7,717 మరణాలు సంభవించాయని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో లెక్కల్లో చూపని 3,951 మరణాలను కూడా చేర్చాక ఈ సంఖ్య వచ్చింది. 82,500 అనుమానాస్పద మరణాల్లో నుంచి ప్రభుత్వం చెబుతున్న సంఖ్యను తీసేసినా  దాదాపు 74,800పైగా మారణాల పరిస్థితి ఏమిటో తెలియదు. దీనిని బట్టి ఇప్పటికీ ఆ రాష్ట్రం రివైజ్డ్‌ లెక్కలు ఇచ్చినా.. అవి కూడా వాస్తవ పరిస్థితికి దగ్గరగా లేవని అర్థమవుతోంది. సహజంగా ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య నమోదులో ట్రాక్‌ రికార్డ్‌ మెరుగ్గా లేదు.  దీంతోపాటు మధ్య ప్రదేశ్‌, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీలో  కలిపి మొత్తం 4.8లక్షల అనుమానాస్పద మరణాలు చోటు చేసుకొన్నట్లు ఓ జాతీయ మీడియా విశ్లేషణలో తేలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని