అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌..

తాజా వార్తలు

Published : 02/04/2021 17:17 IST

అక్కడ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌..

రాయ్‌పూర్‌: దేశంలో రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసులను అరికట్టడానికి ఆంక్షలు విధిస్తూ పలు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని అధికారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో ఏప్రిల్ 6 నుంచి 14 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి భూపేష్‌ బగల్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కొవిడ్ కేసులు అధికంగా నమోదవుతోన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. 

అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా కొనసాగుతుందని దుర్గ్‌ కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరే తెలిపారు. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,617 కొత్త కేసులు నమోదు కాగా, 34 మంది కొవిడ్ బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,804కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే  కరోనా నిబంధనలు కఠినతరం చేసిన ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనవారికి రూ. 500 జరిమానా విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో స్కూళ్లు బంద్‌..

దేశంలో రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతోన్న వైరస్‌ దృష్ట్యా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు రాష్ట్రంలో పాఠశాలలు మూసివేస్తున్నట్లు వెల్లడించింది. 1 నుంచి 8వ తరగతుల వరకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే పాజిటివ్ కేసులు అధికమవుతోన్న తరుణంలో ఏప్రిల్ 4 వరకు పాఠశాలలు(1-8 వ తరగతి) మూసివేయాలని యూపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా ఈ గడువును ఏప్రిల్ 11 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ వ్యాప్తి అధికమైన నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కళాశాలలు, పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని