పార్లమెంటు వద్దే పంటల్ని అమ్ముతాం: టికాయిత్‌

తాజా వార్తలు

Published : 24/03/2021 13:42 IST

పార్లమెంటు వద్దే పంటల్ని అమ్ముతాం: టికాయిత్‌

దిల్లీ: సాగు చట్టాల వ్యతిరేక పోరులో భాగంగా.. అవసరమైతే తమ పంట ఉత్పత్తుల్ని పార్లమెంటు వద్దకు తెచ్చి అమ్ముతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ అన్నారు. ఈ మేరకు ఆయన జైపుర్‌లో నిర్వహించి ‘మహాపంచాయత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైంది. పోరులో భాగంగా.. అవసరమైతే తమ పంటల్ని పార్లమెంటు వద్దకు తెచ్చి అమ్ముతాం. ఆ సమయం వచ్చినపుడు రైతులు సిద్ధంగా ఉండాలి. ఈ ఉద్యమంలో ఇప్పుడు యువతదే ముఖ్యమైన బాధ్యత. ‘జై శ్రీరాం’, ‘జైభీం’ నినాదాల్ని కలిపి లేవనెత్తితేనే దేశాన్ని రక్షించగలం’ టికాయిత్‌ అన్నారు.

అంతకుముందు, సామాజిక కార్యకర్త, సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు యోగేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ.. దేశంలోని రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీని కల్పించాలన్నారు. రైతులు కూడా ప్రభుత్వాన్ని అదే కోరుతున్నారన్నారు. మరోవైపు దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళనలకు మంగళవారం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు మద్దతు తెలిపారు. ‘షహీద్‌ దివస్‌’ సందర్భంగా నిరసనల వేదికల వద్దకు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చిందని సంయుక్తకిసాన్‌ మోర్చా వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని