కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి 

తాజా వార్తలు

Updated : 26/03/2021 08:21 IST

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి 

ముంబయి: ముంబయిలోని ఓ కరోనా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. ముంబయి మహా నగరంలోని భాండప్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో 76 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో తేరుకున్న ఆసుపత్రి సిబ్బంది సుమారు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నట్లు  ముంబయి మేయర్ తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని