‘ఆమె’పై అకృత్యాలు.. అక్కడే ఎక్కువ

తాజా వార్తలు

Published : 10/01/2020 10:37 IST

‘ఆమె’పై అకృత్యాలు.. అక్కడే ఎక్కువ

నేరాల్లో దేశ రాజధానికి అగ్రస్థానం

దిల్లీ: మహిళలపై నానాటికీ పెరుగుతున్న అఘాయిత్యాలు కలవరపెడుతూనే ఉన్నాయి. అతివలపై జరుగుతున్న అత్యాచార ఘటనల్లో వరుసగా మూడో ఏడాది మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంది. 2018లో ఈ రాష్ట్రంలో 5,433 రేప్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. 

2018లో దేశ వ్యాప్తంగా 33,356 అత్యాచార కేసులు నమోదవగా.. ఇందులో దాదాపు 16శాతం ఘటనలు మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నవే. అంత క్రితం 2016, 2017 సంవత్సరాల్లోనూ మధ్యప్రదేశ్‌లోనే అత్యధిక రేప్‌ కేసులు నమోదవడం గమనార్హం. ఇక 2018లో మధ్యప్రదేశ్‌ తర్వాత అత్యంత ఎక్కువ అత్యాచార కేసులు నమోదైన రాష్ట్రాల్లో రాజస్థాన్‌(4,335), ఉత్తరప్రదేశ్‌(3,946), మహారాష్ట్ర(2,142), ఛత్తీస్‌గఢ్‌(2,091) ఉన్నాయి.

నేరాల్లో దిల్లీ టాప్‌..

ఇక అత్యధిక నేరాలు జరుగుతున్న మెట్రో నగరంగా దేశ రాజధాని దిల్లీ తొలి స్థానంలో ఉంది. 2018లో ఇక్కడ 2,25,977 నేర ఘటనలు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత ముంబయిలో 40,757, చెన్నైలో 20,160, కోల్‌కతాలో 19,682 నేరాలు చోటుచేసుకున్నాయి. ఇక దిల్లీలో నమోదైన మొత్తం నేరాల్లో 1215 అత్యాచార కేసులు, 513 హత్య కేసులు, 6,063 కిడ్నాప్‌ కేసులు, 2,444 చోరీ కేసులున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని