‘రేపిస్టుకు భార్యగా ఉండలేను’

తాజా వార్తలు

Updated : 18/03/2020 01:15 IST

‘రేపిస్టుకు భార్యగా ఉండలేను’

ముంబయి: రేపిస్టుకు భార్యగా ఉండలేనని నిర్భయ కేసులో దోషి అక్షయ్‌ఠాకూర్‌ భార్య కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేసింది. 2012లో జరిగిన నిర్భయ గ్యాంగ్‌రేప్‌, అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురిలో అక్షయ్‌ ఒకడు. ఒక రేపిస్టుకు భార్య అనే అపవాదుతో తాను జీవించలేనని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. కాగా.. ఆ మర్నాడే మార్చి 20న అక్షయ్‌ఠాకూర్‌ ఉరికంబం ఎక్కనున్నాడు.

‘నా భర్త నిర్దోషి. కానీ హత్యాచారం కేసులో దోషిగా తేలింది. ఆయనకు ఉరిశిక్ష విదిస్తూ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి నేను అతని భార్యగా, వితంతువుగా జీవించలేను. అందుకే విడాకులు కోరుకుంటున్నాను’ అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. కాగా.. ఏ భార్య అయినా తన భర్త ఏదైనా కేసులో దోషిగా తేలితే విడాకులు తీసుకునేందుకు అర్హురాలు అని ఆమె తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే దోషుల్లో ముగ్గురు తమ కుటుంబాలను ఆఖరిచూపు చూసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. కావాలంటే అక్షయ్‌ఠాకూర్‌ను ఒకసారి చూసుకోవచ్చని అతని కుంటుంబానికి జైలు అధికారులు లేఖ రాశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని