దిల్లీలో 503రైల్వే కోచ్‌లలో కొవిడ్‌ చికిత్స!

తాజా వార్తలు

Published : 17/06/2020 17:46 IST

దిల్లీలో 503రైల్వే కోచ్‌లలో కొవిడ్‌ చికిత్స!

దిల్లీ: దిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో రాజధాని ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. దీనిపై సమీక్షించిన కేంద్ర హోంమంత్రి రైల్వే బోగీల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ పడకలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా 503 రైల్వే ఐసోలేషన్‌ బోగీలను నగరంలోని తొమ్మిది రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లోని 7ప్లాట్‌ఫాంలలో 267బోగీలను అందుబాటులో ఉంచగా, షాకూర్‌ బస్తీ, సారై రోహల్లా స్టేషన్‌లలో 50చొప్పున ఐసోలేషన్‌ బోగీలను అందుబాటులో ఉంచారు. మిగతా బోగీలను నగరంలో పలు రైల్వే స్టేషన్లలో సిద్ధంగా ఉంచారు. దీంతో కరోనా రోగులకు అందించే అన్ని వైద్య సదుపాయాలతో కూడిన 8వేల అదనపు పడకలు అందుబాటులోకి వచ్చాయి. వీటికితోడు నగరంలోని రాధా సోమీ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా కరోనా వైరస్‌ చికిత్సా కేంద్రంగా మారుస్తున్నారు. తద్వారా పదివేల పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ముందే అంచనా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 960బోగీల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ సదుపాయాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఉంచింది. తాజాగా దేశ రాజధానిలో తీవ్రత అధికంగా ఉండడంతో వెంటనే 503బోగీలను అందుబాటులోకి తెచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 372, తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 5 ఐసోలైషన్‌ రైల్వే బోగీలను అందుబాటులో ఉంచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని