ప్రాణవాయువే కరవైన ఆ రోజు!

తాజా వార్తలు

Updated : 26/04/2021 11:37 IST

ప్రాణవాయువే కరవైన ఆ రోజు!

వంద ప్రాణాలను కాపాడిన  దిల్లీ సరోజ్‌ ఆసుపత్రి

దిల్లీ: బతకడానికి, చనిపోవడానికి కొన్ని నిమిషాలే అంతరం. ఆ వ్యవధిలో ఆక్సిజన్‌ నిల్వలు లేక చావుకి, బతుక్కి మధ్య పోరాటం చేశారు దిల్లీలోని సరోజ్‌ ఆసుపత్రిలోని కొవిడ్‌ బాధితులు. శనివారం ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లేక దాదాపు వంద మంది బాధితులు చావు వరకు వెళ్లి బతికి బట్టకట్టారు. ఆ సమయంలో తాము పడిన వేదన అంతా ఇంతా కాదంటున్నారు ఆ ఆసుపత్రి యజమాని పంకజ్‌ చావ్లా.

‘‘శనివారం మా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకుంటున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. వైద్యపరంగా బాగున్న 34 మందిని డిశ్ఛార్జి చేశాం. ఇంకా వందమంది వెంటిలేటర్లపై ఉన్నారు. వేరే ఆసుపత్రులకు తీసుకుపొమ్మని వారి బంధువులకు చెప్పాం. అన్ని ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి అని వారు అందుకు నిరాకరించారు. ఆక్సిజన్‌ కోసం వెంటనే హైకోర్టును ఆశ్రయించాం. తీర్పు వచ్చే వరకు ఒకటే ఉత్కంఠ. చివరకు ఓ భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను అధికారులు పంపారు. కానీ అది పెద్ద ట్యాంకర్‌ కావడంతో ఆసుపత్రిలోకి రాలేని పరిస్థితి. ఇంతలో పోలీసులు ట్యాంకర్‌ను తీరథ్‌ రామ్‌ షా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ నింపిన తర్వాత తిరిగి వస్తామని చెప్పారు. ట్యాంకర్‌ వెళ్లిపోతుంటే ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది ఏడ్చేశారు. అంతలో కొంతమంది సిబ్బంది, పోలీసులు.. 20 సిలిండర్లు నింపుకొని తీసుకొచ్చారు. దీంతో 40 నిమిషాల పాటు వంద మంది ప్రాణాలను కాపాడగలిగాం. ఇంతలో అధికారులు జేసీబీని పంపారు. గోడను కూలగొట్టాం. ట్యాంకరు తిరిగొచ్చింది. లేకపోతే ఆ రోజు వంద మంది ప్రాణాలు పోయేవే’’ అని పంకజ్‌ చావ్లా తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని