Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌కు కారణం ఇదే..! 

తాజా వార్తలు

Published : 24/05/2021 10:57 IST

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌కు కారణం ఇదే..! 

వెలుగులోకి కొత్త అధ్యయనం..

ఈనాడు, దిల్లీ: కరోనా రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ సమస్య తలెత్తడానికి కారణం స్టిరాయిడ్స్‌ను విచక్షణారహితంగా వినియోగించడమేనని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడో కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వీపీ పాండే 210 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులపై చేసిన అధ్యయన వివరాలను రాజీవ్‌ జయదేవన్‌ అనే వైద్యుడు ట్విటర్‌లో పెట్టారు. ఈ అధ్యయనం ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ సోకినవారిలో 14% మంది స్టెరాయిడ్స్‌ ఉపయోగించలేదు. 21% మందికి మధుమేహం లేదు. 36% మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 52% మంది రోగులు మాత్రమే బయటి నుంచి ఆక్సిజన్‌ తీసుకున్నారు. జింక్‌ వినియోగంపై ఇందులో అధ్యయనం చేయలేదని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన రోగుల్లో 100% మంది యాంటీబయాటిక్స్‌ తీసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ‘‘దీన్నిబట్టి చూస్తే ఈ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడానికి స్టెరాయిడ్స్, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలున్నట్లు అనిపిస్తోంది. రోగులకు సూచించిన మందుల్లో అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్‌ లాంటివి కనిపించాయి. అందువల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ పెరగడానికి యాంటీ బయాటిక్సే కారణంగా కనిపిస్తోంది’’ అని జయదేవన్‌ అభిప్రాయపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని