ఏటీఎం ద్వారా రేషన్‌ సరకులు

తాజా వార్తలు

Updated : 16/07/2021 16:13 IST

ఏటీఎం ద్వారా రేషన్‌ సరకులు

దేశంలోనే తొలిసారిగా గురుగ్రామ్‌లో ఏర్పాటు

గురుగ్రామ్‌: ఏటీఎంల ద్వారా ఖాతాలోని నగదు తీసుకోవడం గురించి అందరికీ తెలుసు. కానీ, అలాంటి ఏటీఎంల ద్వారా రేషన్‌ సరకులు వస్తే.. చౌక ధరల దుకాణాల ముందు బారులు తీరాల్సిన అవసరం ఉండదు కదా! అలాంటి ప్రయత్నమే చేపట్టింది హరియాణా ప్రభుత్వం. దేశంలోనే తొలి ‘రేషన్‌ ఏటీఎం’ను గురుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం నుంచి 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. ఇందులో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటుంది. టచ్‌స్క్రీన్‌ ద్వారా లబ్ధిదారుడు ఆధార్‌ లేదా రేషన్‌ ఖాతా నెంబర్‌ పొందుపరచాలి. బయోమెట్రిక్‌ ధ్రువీకరణ జరగగానే, వారికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమేటిక్‌గా సంచుల్లో నింపేస్తుంది. వీటి ఏర్పాటుతో రేషన్‌ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెర పడుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని