Antibodies: ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే

తాజా వార్తలు

Updated : 30/07/2021 10:29 IST

Antibodies: ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే

అత్యంత శక్తిమంతమైన, నిలకడగా ఉండే మినీ యాంటీబాడీల సృష్టి
 ప్రస్తుత ప్రతినిరోధకాల కంటే వెయ్యి రెట్లు బలమైనవి 
జర్మనీ శాస్త్రవేత్తల ఘనత

బెర్లిన్‌: కరోనా మహమ్మారిని మరింత సమర్థంగా అడ్డుకునేందుకు... నిలకడగా ఉండే అత్యంత శక్తిమంతమైన మినీ యాంటీబాడీలను జర్మనీ శాస్త్రవేత్తలు తయారుచేశారు! దక్షిణ అమెరికాలో ఉండే ఒంటె జాతికి చెందిన ఆల్పకా జంతువుల రక్తం ద్వారా వీటిని అభివృద్ధిపరిచారు. అత్యంత ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గొటింజెన్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోఫిజికల్‌ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు సాగించిన ఈ పరిశోధన వివరాలను ‘ఈఎంబీవో’ పత్రిక అందించింది.

‘‘మేము రూపొందించిన సూక్ష్మ ప్రతినిరోధకాలు... ప్రస్తుత యాంటీబాడీల కంటే వెయ్యి రెట్ల శక్తితో వైరస్‌ను బంధించి, బలహీనపరుస్తాయి. 95 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని, సమర్థంగా పనిచేయగలవు. కొవిడ్‌ను అడ్డుకునే ఔషధానికి అవసరమైన లక్షణాలన్నీ  వీటికి ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల కరోనా కొమ్ము ప్రొటీన్‌ను ఇవి అత్యంత సమర్థంగా అడ్డుకుంటాయని గుర్తించాం. త్వరలోనే ప్రయోగ పరీక్షలు చేపడతాం. వీటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే కాబట్టి... ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన కొవిడ్‌ చికిత్సలను అందించే వీలుంటుంది’’ అని పరిశోధనకర్త డిర్క్‌ గోర్లిచ్‌ చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని