India Corona : 39,742 కేసులు.. 39,972 రికవరీలు

తాజా వార్తలు

Updated : 25/07/2021 10:16 IST

India Corona : 39,742 కేసులు.. 39,972 రికవరీలు

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్తకేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,742 కొత్త కేసులు నమోదు కాగా.. 535 మరణాలు చోటుచేసుకున్నాయి.

* గడిచిన 24 గంటల్లో 17,18,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

* తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,20,551కి చేరింది.

* కొత్త కేసులతో పోల్చితే.. రికవరీల సంఖ్య కూడా దాదాపు సమానంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 39,972 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,05,43,138కి చేరింది.

* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,08,212కి చేరి.. ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది.

* దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న 51,18,210 మందికి వ్యాక్సిన్‌ అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 43,31,50,864కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని