close

తాజా వార్తలు

Published : 21/01/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రికవరీ రేటు..96.70శాతం

24 గంటల్లో 15,223 కొత్త కేసులు..151 మరణాలు

దిల్లీ: దేశంలో రోజూవారీ కరోనా వైరస్ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ..వ్యాప్తి అదుపులోనే ఉండటం ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం 15,223 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,10,883కి చేరింది. అయితే, గత రెండు రోజులతో పోల్చుకుంటే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 

ఇక క్రియాశీల కేసుల సంఖ్యలో తగ్గుదల కొనసాగుతోంది. ప్రస్తుతం 1,92,308 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.86 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 19,965 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దాంతో నిన్నటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,02,65,706 (96.70శాతం)కి చేరింది. గడిచిన 24 గంటల్లో 151 మంది కొవిడ్ కారణంగా మృత్యుఒడికి చేరుకోగా.. ఇప్పటి వరకు 1,52,869 మంది బలయ్యారు. అలాగే దేశంలో జనవరి 20 నాటికి 18,93,47,782 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 

ఇవీ చదవండి:

కొవిడ్ టీకా అలజడి

గుండె ఆరోగ్యానికి చిన్న మార్పులైనా చాలు!



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని