21శాతం: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు!
close

తాజా వార్తలు

Published : 11/05/2021 22:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

21శాతం: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు!

గోవా, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌లో అత్యధికం

దిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో రాష్ట్రాలన్నీ ఆంక్షలవైపు అడుగులు వేస్తున్నాయి. పూర్తి లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాలు మినహా చాలా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు సరాసరి 21శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

పాజిటివిటీ రేటు అధికం ఇక్కడే..

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 48శాతం ఉండగా హరియాణాలో 37శాతంగా ఉంది. మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌తో సహా 18రాష్ట్రాల్లో మాత్రం ఓ మాదిరిగా లేదా రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. ఇక బెంగళూరు అర్బన్‌, చెన్నై, ఎర్నాకులం, మలప్పురం నగరాల్లో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

13రాష్ట్రాల్లో లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లక్షలకు పైగా కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో ఆరు రాష్ట్రాల్లో 50 నుంచి లక్ష కేసులు ఉన్నాయని, మిగతా 17 రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య 50వేలకు తక్కువే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తొలి డోసు తీసుకున్న వారికే ప్రాధాన్యత..

పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడుతున్నట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలోనూ ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ముఖ్యంగా తొలిడోసు తీసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్లలో 70శాతం రెండో డోసువారి కోసం కాగా మరో 30శాతం కొత్తవారికి (తొలి డోసు) ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా అవసరమైతే వాటిని వంద శాతానికి పెంచుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17.27కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని