ఆ యాప్‌లను ఎలా నిషేధిస్తారు.. చైనా చిందులు 

తాజా వార్తలు

Updated : 27/01/2021 16:40 IST

ఆ యాప్‌లను ఎలా నిషేధిస్తారు.. చైనా చిందులు 

అది డబ్ల్యూటీవో నిబంధనల ఉల్లంఘనేనని వ్యాఖ్య

దిల్లీ‌: టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చైనా ఆక్రోశం వ్యక్తంచేసింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ  నియమాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఈ చర్యలు చైనా సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని చిందులు తొక్కుతోంది. గతేడాది ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో చైనా దురాక్రమణకు కళ్లెం వేసేందుకు భారత్‌ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో జారీ చేసిన నోటీసులపై ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై ఇటీవల నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఈ అంశంపై దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీ రోంగ్‌ స్పందించారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ గతేడాది భారత్‌ పదే పదే చైనాకు చెందిన పలు మొబైల్‌ యాప్‌లను నిషేధించిందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, మార్కెట్‌ సూత్రాలను ఉల్లంఘించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. వివక్షతో కూడిన ఈ చర్యలను భారత్‌ సరిచేసుకోవాలని, తద్వారా ద్వైపాక్షిక సహకారానికి ముందుముందు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి..

పాక్‌ సరిహద్దు వైపు వెళ్లొద్దు

భారత్‌లో టిక్‌టాక్‌ నిషేధం



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని