Mask: పిల్లల్లో రోగనిరోధక శక్తిని దెబ్బ తీయొచ్చు!
close

తాజా వార్తలు

Published : 20/06/2021 01:31 IST

Mask: పిల్లల్లో రోగనిరోధక శక్తిని దెబ్బ తీయొచ్చు!

బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: మాస్కులు, భౌతిక దూరం కరోనాకు చెక్‌ పెట్టే రక్షణ కవచాలు కాగా.. అవే చిన్నారులకు ప్రమాదకరంగా మారనున్నాయట. అవి వారి రోగ నిరోధకశక్తిని బలహీనపరచనున్నాయట. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఓ మీడియా సంస్థ కథనం పేర్కొంది. 

ఏడాదిన్నర కాలంగా కరోనా వ్యాప్తితో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గిపోయింది. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరిస్తున్నారు. పాఠశాలలు మూసివేయడంతో చిన్నారులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. తోటివారితో కలిసి ఆడుకోవడం, బయట తిరగడం దాదాపు తగ్గిపోయింది. దాంతో వారికి వైరస్, బ్యాక్టీరియా వంటి వ్యాధి కారకాలు సోకే అవకాశం గణనీయంగా తగ్గింది. అందుకు తగ్గట్టే వారి రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే అవకాశమూ తగ్గిపోయింది. దాంతో కరోనా మహమ్మారి తదనంతర రోజులకు అనుగుణంగా వాటితో పోరాడే రోగనిరోధక శక్తిని వారు సమకూర్చుకోలేక పోతున్నారని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.

పిల్లలపై ప్రభావం చూపే రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ) గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. ఏడాది లోపు పిల్లల్లో ఇది ఊపిరితిత్తులను దెబ్బతీసి, ప్రాణాంతకంగా మారుతుంది. దీనికి టీకా కూడా లేదు. కొవిడ్‌కు ముందు ఆర్‌ఎస్‌వీ కారణంగా పిల్లలు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఉండేది. బ్రిటన్‌లో ప్రతిఏటా సుమారు 30వేల మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరేవారు. వారంతా ఐదేళ్లలోపు వారే. అయితే ఇప్పుడు మాస్క్, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలతో ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పరిశోధకులు చెప్పారు. కానీ మళ్లీ ప్రపంచం సాధారణ స్థాయికి చేరుకున్నాక.. ఈ ఆర్‌ఎస్‌వీ మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అప్పుడు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పిల్లలకు ముప్పు తీవ్రంగా ఉండనుందన్నారు. అయితే దీనికి తగ్గట్టుగా వైద్యపరంగా సిద్ధమవుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని