తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం
close

తాజా వార్తలు

Updated : 30/05/2021 12:48 IST

తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం

రియోడిజనీరో: తల్లి ప్రోత్సాహం ఉంటే ప్రపంచంలో ఎంతటి పనైనా సాధ్యమే. చిన్నప్పటి నుంచి చెయ్యి పట్టుకుని నడిపించే అమ్మ.. మన వెన్నంటే ఉండి ధైర్యం చెబితే ఆ ఉత్తేజం అంతా ఇంతా కాదు. అలాంటి స్ఫూర్తినిచ్చే వీడియో ఒకటి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. నడవడానికే ఇబ్బంది పడే ఓ చిన్నారి తన తల్లి ఇచ్చిన ధైర్యంతో చేసిన పని నెటిజన్ల మదిని దోచుకుంటోంది. ఆంటోనెలా అనే చిన్నారికి ఒక కాలు లేదు. ఆమెకు కృత్రిమ కాలు అమర్చారు. ఓ చిన్న గొయ్యి నుంచి పైకి ఎక్కేందుకు తను చేసిన ప్రయత్నానికి తన తల్లి ప్రోత్సాహం తోడైంది. తనపై తాను నమ్మకం లేకపోయినా తన తల్లి చెప్పిన మాటలతో పైకి ఎక్కేసింది. ‘‘నువ్వు చేయగలవు. కిందపడిపోవు. నువ్వు బలమైన దానివి’’ అంటూ తల్లి అందించిన తోడ్పాటు అసమానమంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక పైకి ఎక్కిన తర్వాత ప్రేమతో చిన్నారి.. తన తల్లిని చూసిన చూపులు కట్టిపడేస్తున్నాయి. గుడ్‌న్యూస్‌ కరెస్పాండెంట్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ ఈ వీడియోను ట్వీట్‌ చేసింది. వేలాది మంది దీనికి స్పందిస్తూ చిన్నారిని అభినందిస్తున్నారు. ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగినట్లు తెలుస్తోంది.    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని