ఒక్కడోసు తీసుకున్నా అక్కడ మాస్కు అక్కర్లేదు

తాజా వార్తలు

Updated : 26/05/2021 21:37 IST

ఒక్కడోసు తీసుకున్నా అక్కడ మాస్కు అక్కర్లేదు

సియోల్‌: మాస్కులు నిత్యజీవితంలో భాగమై పోయాయి. ఇప్పుడంతా మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగే రోజుల కోసం వేచిచూస్తున్నారు. కానీ, మహమ్మారి అంతమయ్యే వరకూ మాస్కులు లేకుంటే ప్రమాదం పక్కనున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అత్యధిక మందికి టీకాలు అందజేసిన అమెరికాలో మాత్రం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాస్కులు లేకుండానే తిరిగేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఇదే జాబితాలో చేరేందుకు తాజాగా దక్షిణ కొరియా సైతం ఉవ్విళ్లూరుతోంది.

కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. జులై నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రధాని కిమ్‌ బూ క్యుమ్‌ ప్రకటించారు. అక్టోబర్ నాటికి 70 శాతం మందికి టీకాలు అందుతాయని.. అప్పటి నుంచి క్వారంటైన్‌ నిబంధనల్ని సైతం సవరిస్తామని వెల్లడించారు. 60-74 ఏళ్ల మధ్య వయసు వారిలో 60 శాతం మంది ఇప్పటికే వ్యాక్సిన్ల కోసం రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు.

దక్షిణ కొరియా జనాభా 5.2 కోట్లు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 7.7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సెప్టెంబరు నాటికి కనీసం 70 శాతం మందికి టీకాలు అందించాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికే మాస్కు నిబంధనను సడలించేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి అక్కడ 65-74 ఏళ్ల మధ్య వయసు గల సామాన్య ప్రజలకు టీకాలు అందించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దేశంలో ఇప్పటి వరకు 1,37,682 మంది మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 1,940 మంది మృత్యువాతపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని