CRPF: వీవీఐపీల రక్షణకు మహిళా దళం..!

తాజా వార్తలు

Published : 17/09/2021 22:46 IST

CRPF: వీవీఐపీల రక్షణకు మహిళా దళం..!

దిల్లీ: మహిళా సిబ్బందికి సంబంధించి కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం(సీఆర్‌పీఎప్‌) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి వీవీఐపీలకు మహిళా దళం కూడా రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా మొదట విడతలో 33 మంది ఉద్యోగినులకు శిక్షణ ఇవ్వనుంది. పది వారాల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 

దీనిలో భాగంగా హోంమంత్రిత్వ శాఖ ఆమోదంతో కొన్ని రోజుల క్రితం ఎంపిక కూడా జరిగిందని తెలుస్తోంది. వారికి ఏకే-47 వంటి రైఫిల్స్ వాడటంలో కూడా శిక్షణ ఇవ్వనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. కొద్ది నెల్లలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని..మహిళా వీవీఐపీలకు వీరు రక్షణగా వెళ్లనున్నట్లు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని