Jammu Kashmir: బందీపొరలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

తాజా వార్తలు

Updated : 26/09/2021 20:33 IST

Jammu Kashmir: బందీపొరలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

మృతుల్లో ఒకరు భాజపా జిల్లా అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లోని బందీపొర జిల్లాలో ఆదివారం భద్రతాదళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌కుమార్‌ ధ్రువీకరించారు. మృతులను ఆజాద్‌, అబిద్‌లుగా గుర్తించినట్లు, వీరికి ‘లష్కరే తోయిబా’తో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఆజాద్‌ అనే ఉగ్రవాది.. గతేడాది జులైలో భాజపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాసిం బారీ, ఆయన తండ్రి, సోదరుడిని కాల్చి చంపిన కేసులో నిందితుడని పేర్కొన్నారు. అబిద్‌.. పాకిస్థాన్‌లో శిక్షణ పొందినట్లు వివరించారు.

‘బందీపొరలోని వాత్నిర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు మాకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ ప్రారంభించాం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాం’ అని ఆయన వివరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మరోవైపు శనివారం రాత్రి నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) దాటి ఉరీ సెక్టార్‌లోకి చొరబడిన ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు గాయపడినట్లు సమాచారం. ఉరి సెక్టార్‌లో ఈ నెలలో ఇది రెండో చొరబాటు. సెప్టెంబర్ 23న భద్రతాదళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో వారివద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని